గండీ అసెంబ్లీ స్థానానికి కల్పనా సోరెన్ నామినేషన్

గండీ అసెంబ్లీ స్థానానికి  కల్పనా సోరెన్ నామినేషన్

రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌‌‌‌ సోరెన్‌‌ భార్య కల్పనా సోరెన్ గండీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు వేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థిగా బరిలోకి దిగారు. సోమవారం జార్ఖండ్ సీఎం చంపయీ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్​ ప్రెసిడెంట్ రాజేశ్ ఠాకూర్, మంత్రులు అలంగీర్ అలం, సత్యా నంద్ బోక్తా ఇతర నాయకులతో కలిసి నామి నేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘‘మమ్మల్ని ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి. గండీ ప్రజల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో, రాష్ట్రంలో ఇండియా కూటమి బలంగా ఉంది. నేను సద్విమర్శలను స్వీకరి స్తా” అని చెప్పారు. కాగా, జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌‌ అహ్మద్‌‌ రాజీనామా చేయ డంతో గండీ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఇక్క డ మే 20న ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.