ఆస్తి కోసం అత్తా కోడళ్లు కొట్టుకున్నారు..వీడియో

ఆస్తి కోసం అత్తా కోడళ్లు కొట్టుకున్నారు..వీడియో

ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు.. ఒక ఇంట్లో అత్తా కోడళ్లు కలిసి ఉండరనేది జగమెరిగిన సత్యం. అందుకే అన్నారు అత్తలేని కోడలు ఉత్తమురాలు హోయమ్మా.. కోడలు లేని అత్త గుణవంతురాలు’ అని.  అత్తా కోడళ్ల లొల్లి అనేది ప్రతీ ఇంట్లో జరిగే సాధారణ అంశమే. అయితే ఇక్కడ కూడా ఓ అత్తా కోడల మధ్య తీవ్రమైన ఘర్ష ణ జరిగింది. జట్టుపట్టుకుని కొట్టుకున్నారు. పక్కన భర్తలు, పిల్లలు ఉన్నా పట్టించుకోలేదు. సోఫా మీదు దొర్లుకుంటూ కొట్టుకున్నారు. కొరుక్కున్నారు. గుజరాత్‌ సూరత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఎందుకు కొట్టుకున్నారు...?

గుజరాత్ లోని సూరత్ లో అత్తా కోడలు మధ్య  ఆస్తి విషయంలో ఘర్షణ నెలకొంది. సూరత్ లో  అత్తా మామలకు సంబంధించిన ఓ ఆస్తిని కోడలు తన పేరుమీదకు మార్చుకుంది. తాజాగా మరొక ఆస్తిని కూడా అదే విధంగా తన పేరుమీదకు మార్చుకునేందుకు కోడలు ప్రయత్నించింది. ఈ విషయంలో అత్తాకోడలికి తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. కోడలు అత్తపై దాడికి దిగింది. ఎక్కడ పడితే అక్కడ కొరికింది. చేతులతో గిల్లింది. కోడలు దాడిలో అత్తకు గాయాలయ్యాయి. 

కొడుకు ఫిర్యాదు..

అత్తాకోడళ్ల వివాదంపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అమ్మను తనను వేధిస్తోందని పోలీసులకు కంప్లేయింట్ ఇచ్చాడు. మరోవైపు కోడలు ఇప్పటికే తన భర్త, అత్తమామలపై వేధింపుల కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.