యే బిడ్డా.. ఇది వార్నర్‌‌ అడ్డా

యే బిడ్డా.. ఇది వార్నర్‌‌ అడ్డా

హైదరాబాద్‌‌, వెలుగు: ఐపీఎల్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ టీమ్‌‌కు ఆడిన ఆస్ట్రేలియా స్టార్‌‌ క్రికెటర్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌ తెలుగు సినిమాలకు కనెక్ట్‌‌ అయ్యాడు. అప్పట్లో బుట్టబొమ్మా పాటకు ఫ్యామిలీతో కలిసి  స్టెప్పులేసి ఫ్యాన్స్‌‌ను ఫిదా చేసిన డేవిడ్‌‌.. టాలీవుడ్‌‌ హీరోల పాపులర్‌‌ సీన్స్‌‌ను తన ఫేస్‌‌తో మార్ఫింగ్‌‌ చేసి  సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేస్తూ ఫన్‌‌ క్రియేట్‌‌ చేస్తున్నాడు. ఈ మధ్య కొంత గ్యాప్‌‌ ఇచ్చిన ఆసీస్‌‌ స్టార్‌‌... ఇప్పుడు అల్లు అర్జున్‌‌  పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా’ వీడియో సాంగ్‌‌ను మార్ఫ్‌‌ చేశాడు. ఫేస్‌‌ స్వాపింగ్‌‌ యాప్‌‌ సాయంతో ఈ సాంగ్‌‌లో హీరో ముఖానికి బదులు తన ఫేస్‌‌ వచ్చేలా చేశాడు. ఈ వీడియోను శనివారం తన ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్‌‌ చేసి ‘క్యాప్షన్‌‌ ఇవ్వండి’ అన్నాడు. దీన్ని చూసి ఫ్యాన్స్‌‌ ఫిదా అయ్యారు. ‘యే బిడ్డా.. ఇది వార్నర్‌‌ అడ్డా’, ‘డేవిడ్‌‌ పుష్ఫరాజ్‌‌..  తగ్గేదేలే’  అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై విరాట్‌‌ కోహ్లీ, సాహా, మిచెల్‌‌ జాన్సన్‌‌ సైతం స్పందించారు.  ‘నువ్వు బాగానే ఉన్నవా? అని కోహ్లీ సరదాగా కామెంట్‌‌ చేశాడు. కొంచెం గొంతు నొప్పి ఉందన్న వార్నర్‌‌.. గబ్బా టెస్టులో తన తలకు అయిన గాయాన్ని ప్రస్తావిస్తూ .. ‘నువ్వు నా తల గురించి అడుగుతున్నావని తెలుసు. అదెప్పుడూ సరిగ్గా ఉండదు’ అని జోక్​ చేశాడు. మరోవైపు ‘మై బ్రదర్‌‌.. తగ్గేదేలే అంటూ’  హీరో అల్లు అర్జున్‌‌ కూడా కామెంట్‌‌ చేశాడు.