వందవ టెస్టులో వార్నర్ చారిత్రాత్మక ఇన్నింగ్స్

వందవ టెస్టులో వార్నర్ చారిత్రాత్మక ఇన్నింగ్స్

తన వందో టెస్టును ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. వందో టెస్టులో వార్నర్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో వార్నర్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సిండ్ డే టెస్టులో  వార్నర్ శతకం సాధించి..రికీ పాంటింగ్ రికార్డును సమం చేశారు. 



ఈ టెస్టులో డేవిడ్ వార్నర్ 145 బంతుల్లో సెంచరీ చేశారు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. దీంతో వందో  మ్యాచ్‌లో సెంచరీ చేసిన 10వ బ్యాట్స్‌మెన్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. అలాగే ఈ మ్యాచ్‌లో 78వ పరుగు పూర్తి చేసిన తర్వాత వార్నర్ తన టెస్ట్ కెరీర్‌లో 8వేల పరుగులను కూడా పూర్తి చేశాడు. దీంతో టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఎనిమిదో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్గా వార్నర్ నిలిచారు.