సామీ సామీ సాంగ్‌కు వార్నర్ కుమార్తెల స్టెప్స్.. పుష్ప ఫిదా

సామీ సామీ సాంగ్‌కు వార్నర్ కుమార్తెల స్టెప్స్.. పుష్ప ఫిదా

తెలుగు సినిమా అభిమానుల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో అతడు చెప్పే తెలుగు సినిమా డైలాగ్స్, సాంగ్స్‌కు వేసే స్టెప్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా అప్పట్లో ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ’ సాంగ్‌ ఇంటర్నేషనల్ రేంజ్‌లో వైరల్ కావడంలో డేవిడ్ భాయ్ క్రెడిట్ కచ్చితంగా ఉందని హీరో అల్లు అర్జున్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తెలుగు సినిమాల్లో చాలా పాపులర్ సాంగ్స్‌కు డేవిడ్ రీల్స్ చేస్తున్నాడు. లేటెస్ట్‌గా పాన్ పాన్ ఇండియా హిట్ ‘పుష్ప’ మూవీలోని శ్రీవల్లి సాంగ్‌లో అల్లు అర్జున్ చేసిన స్టెప్‌ను డేవిడ్ వార్నర్ అచ్చం దింపేశాడు. చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటూ వార్నర్ చేసిన స్టెప్స్ కు సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ వస్తోంది. ఇప్పుడు తాజాగా పుష్ప మూవీలోని సామీ.. సామీ.. బంగారు సామీ.. మీసాల సామీ అన్న సాంగ్‌కు డేవిడ్ కుమార్తెలు ముగ్గురు క్యూట్ క్యూట్‌గా స్టెప్స్ వేశారు.

చిన్నారుల స్టెప్స్‌కు పుష్ప రియాక్షన్

తన కుమార్తెలు ఇస్లా రోజ్, ఇండి రే, ఐవీ మయే కలిసి చేసిన డాన్స్ వీడియోను ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్. మమ్మీ, డాడీకి ముందుగా ఈ పాటకు డ్యాన్స్ చేశారంటూ తన పిల్లల వీడియోను షేర్ చేశాడు. ఈ చిన్నారుల డాన్స్‌కు పుష్ప హీరో, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయిపోయారు. సో క్యూట్ అంటూ ఆ వీడియో కింది బన్నీ కామెంట్ పెట్టాడు.