అధికారుల ను పారదర్శకంగా విచారిస్తున్నం : డీసీఏ డీజీ షానవాజ్ ఖాసీం

అధికారుల ను పారదర్శకంగా విచారిస్తున్నం :  డీసీఏ డీజీ షానవాజ్ ఖాసీం

    డీసీఏ డీజీ షానవాజ్ ఖాసీం

హైదరాబాద్, వెలుగు: డ్రగ్  కంట్రోల్  అడ్మినిస్ట్రేషన్​లో అవినీతికి తావులేదని, అధికారులపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకంగా విచారిస్తున్నామని డీసీఏ డైరెక్టర్  జనరల్  షానవాజ్  ఖాసీం స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తమ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. 

నకిలీ మందుల విషయంలో తాము జీరో టోలరెన్స్  విధానాన్ని పాటిస్తున్నామని, శాఖ చరిత్రలోనే తొలిసారిగా నకిలీ మందుల తయారీ, అమ్మకాలకు పాల్పడుతున్న నలుగురు డీలర్లను అరెస్ట్  చేసి జైలుకు పంపామని గుర్తుచేశారు.