హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని డీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్ దరఖాస్తులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం డీఈఈసెట్–2023 నోటిఫికేషన్‌ను అధికారులు రిలీజ్ చేశారు. ఈ నెల 22 నుంచి మే 22 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చని డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాస్‌చారి తెలిపారు. మే 27 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, జూన్ 1న డీఈఈసెట్ ఎగ్జామ్ ఉంటుందని వెల్లడించారు. జూన్ 8న ఫలితాలు రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

