హైదరాబాద్:గచ్చిబౌలి రోడ్లపై జింక హల్ చల్ చేసింది. సమీప అడవులనుంచి దారి తప్పి వచ్చిన జింక.. రోడ్లపై ఎగురుతూ , దుంకుతూ హంగామా చేసింది. పాత ముంబై హైవే పై అటు ఇటు పరుగులు పెడుతూ వేగంగా దుసుకెళ్తూ కార్లను ఢీకొట్టింది.
శనివారం (జనవరి 3) సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక జనసంచారంలోకి వచ్చింది. భయంతో రోడ్లపై అటు ఇటు పరుగులు పెట్టింది.పాత ముంబై హైవే పైకి రావడంతో కొంత సమయం ట్రాఫిక్ జామ్ అయ్యింది. జింకను ప్రయాణికులు ఆసక్తిగా చూశారు. అయితే కొత్త ప్రదేశంలో బెదిరిపోయిన జింక వేగంగా దూసుకొచ్చి ఓ కారును ఢీకొట్టింది. దీంతో స్వల్పంగా గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ ప్రొటెక్షన్ టీం.. సంఘటన స్థలానికి చేరుకొని వన్యప్రాణి సంరక్షణ జింకను పట్టుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
