పోలీసులకు లొంగిపోయిన మావోయిస్ట్ కీలక నేతలు దేవ, రాజిరెడ్డి

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్ట్ కీలక నేతలు దేవ, రాజిరెడ్డి

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు కీలక నేతలు బర్సీ దేవా, కంకణాల రాజిరెడ్డి లొంగిపోయారు. వీరితోపాటు మరో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.పీపుల్స్ లిబరేషన్  గెరిల్లా కమాండర్ గా ఉన్న దేవా.. 2003లోమావోయిస్టు పార్టీలో చేరారు. దేవా పై తెలంగాణ, మహారాష్ట్ర, ఛాతీసుగార్డ్ రాష్ట్రాల్లో 75 లక్షల రివార్డు ఉంది. దేవాతోపాటు  తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు కంకణాల రాజిరెడ్డి కూడా సరెండర్ అయ్యారు.. దేవాతోపాటు సౌత్ జోనల్ బ్యూరో రవి కూడా లొంగిపోయిన  మావోయిస్టులలో ఉన్నారు.  

డీజీపీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పీజీఎల్ ఏ గ్రూపులో 400మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం 60మంది మాత్రమే ఉన్నారని  అన్నారు. ఒక్క రాష్ట్ర కమిటీ సభ్యుడు మాత్రమే మిగిలారు. సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపుతో వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సమకూర్చడంతో బర్సె దేవా కీరోల్ పోషించారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు, ఆరోగ్య సమస్యలతో లొంగిపోయారు అని చెప్పారు. ఈ లొంగుబాటుతో పీజీఎల్‌ఏ బెటాలియన్‌ మొత్తం​ కొలాప్స్‌ అయ్యిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు నిబంధనల ప్రకారం రివార్డులు అందిస్తాం. తక్షణ సాయంగా రూ.25వేల చెక్కలను అందిస్తామని చెప్పారు. 

లొంగిపోయిన మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మేం లొంగిపోయాం..లొంగిపోతే ఉపాధి అవకావం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కష్టమైన పని అన్నారు. ఆధునిక టెక్నాలజీ రోజుల్లో సాయుధ పోరాటం చాలా కష్టం.. తెలంగాణ క్యాడర్, ఇతర క్యాడర్లు అందు కే లొంగిపోతున్నారని  అన్నారు. అనారోగ్య సమస్యలతో లొంగిపోతున్నామన్నారు.