హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. నానక్ రామ్ గూడలో ఈగల్ టీం తనిఖీలు చేయగా.. డ్రగ్స్ తీసుకుంటూ ఏపీ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు దొరికాడు. దీంతో సుధీర్ రెడ్డిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే టెస్టు చేయగా సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు పోలీసులు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్టు చేశారు పోలీసులు. గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు సుధీర్ రెడ్డి. గత కొన్ని రోజుల నుంచి సుధీర్ రెడ్డి కుటుంబ సమస్యలతో సతమతవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం డ్రగ్స్ కట్డడిపై దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ లో అణువణువు గాలిస్తూ డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిరంతరం నిఘా పెడుతోంది.
