తిరుమల లడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

తిరుమల లడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

తిరుమల లడ్డు అంశం ఏపీ రాజకీయాల్లో రేపుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ పీక్స్ కి చేరిన క్రమంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిటీ నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది సుప్రీంకోర్టు. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ పై సోమవారం ( ఫిబ్రవరి 23 ) వాదనలు విన్న సుప్రీం.. ఏకసభ్య కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏక సభ్య కమిటీ నియామకంపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది సుప్రీంకోర్టు.సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‍లో ఎలాంటి ఆధారాలు లేవని.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఏకసభ్య కమిషన్ విచారించవచ్చని స్పష్టం చేసింది సుప్రీం.  సీఎం బహిరంగ వేదికలపై ప్రకటనలు చేస్తున్నారన్న వాదనలు తోసిపుచ్చిన సుప్రీం.. పరిపాలన అంశాలపై విచారణకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

►ALSO READ | రాజమండ్రి కల్తీ పాల ఘటన.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

సిట్ నివేదిక మేరకే వైఫల్యాలు, లోపాలు, బాధ్యులను గుర్తించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఏకసభ్య కమిషన్ విచారణను కొనసాగించవచ్చని.. సిట్ తదుపరి దర్యాప్తు కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.