దొంగతనాలకు అలవాటు పడ్డాడని..12 ఏళ్ల కొడుకుని గొలుసులతో కట్టేసి.. నాగ్‌పూర్‌లో దారుణం..

దొంగతనాలకు అలవాటు పడ్డాడని..12 ఏళ్ల కొడుకుని గొలుసులతో కట్టేసి..  నాగ్‌పూర్‌లో దారుణం..

నాగ్‌పూర్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 12 ఏళ్ల బాలుడు సెల్‌ఫోన్ల దొంగతనంకి  అలవాటు పడ్డాడని అతని తల్లిదండ్రులు దాదాపు రెండు నెలల పాటు ఇంట్లోనే గొలుసులతో కట్టేసి బంధించారు.

 వివరాలు చూస్తే రోజు కూలీలైన తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకు పనికి వెళ్ళేటప్పుడు  కొడుకు కాళ్ళు, చేతులు గొలుసులతో కట్టేసి   తాళం వేసి వెళ్లేవారు. మధ్యాహ్నం వరకు ఆ పిల్లడు ఆలా ఒంటరిగానే ఉండేవాడు.

 చైల్డ్ హెల్ప్‌లైన్ (1098)కు అందిన సమాచారంతో అధికారులు ఇంటికి వెళ్లి చూడగా ఆ బాలుడు ఒక బకెట్‌పై నిలబడి గొలుసులతో బంధించి ఉన్నాడు. అతని ఒంటిపై కొన్ని పాత గాయాలు కూడా ఉన్నాయి.

ALSO READ : ప్రియాంక గాంధీ కొడుకు రైహాన్ వాద్రా నిశ్చితార్థం..

 అయితే పిల్లడు స్కూల్ మానేసి దొంగతనాలకు అలవాటు పడ్డాడని, అందుకే బయటకు వెళ్లకుండా ఇలా చేశామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అధికారులు బాలుడిని రక్షించి ప్రభుత్వ బాలల గృహానికి తరలించారు. అక్కడ అతనికి వైద్యం ఇంకా కౌన్సెలింగ్ అందిస్తున్నారు.

దీనికి సంబంధించి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా... ఈ కేసును జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 సహా ఇతర సంబంధిత పిల్లల రక్షణ చట్టాల కింద దర్యాప్తు చేస్తున్నారు. అలాగే బాలుడి భవిష్యత్తుపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) నిర్ణయం తీసుకోనుంది.