హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని డీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే డీఈఈసెట్ –2023 ఎంటెన్స్ ఎగ్జామ్జూన్ 1న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ నెల 22 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిసింది. డీఈఈసెట్ ద్వారా డీపీఎస్ఈ, డీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపడతారు. కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.
