హైదరాబాద్ లో తొలిసారిగా మిస్సైల్స్‌‌ ఎగ్జిబిషన్

 హైదరాబాద్ లో తొలిసారిగా మిస్సైల్స్‌‌ ఎగ్జిబిషన్

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్​ కంచన్‌‌బాగ్‌‌లోని భారత్‌‌ డైనమిక్స్‌‌ లిమిటెడ్‌‌ (బీడీఎల్)​లో మిస్సైల్స్‌‌ ఎగ్జిబిషన్‌‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌‌లో యాంటీ ట్యాంక్‌‌ గైడెడ్‌‌ మిస్సైల్స్, సర్‌‌‌‌ఫేస్ ఎయిర్ మిస్సైల్స్, మిస్సైల్‌‌ లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్‌‌ సహా మరెన్నో లేటెస్ట్‌‌ మిస్సైల్స్‌‌ను ప్రదర్శిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 19 వరకు ఈ ఎగ్జిబిషన్‌‌ జరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం4 గంటల వరకు ఐడీ కార్డు ఉన్న స్టూడెంట్లను ఎగ్జిబిషన్ చూసేందుకు అనుమతిస్తారు. డిఫెన్స్ ప్రొడక్టుల ప్రాముఖ్యతను ఇక్కడ వివరిస్తారు. రాకెట్‌‌ లాంచర్లు, ఎయిర్ మిస్సైల్స్, అండర్ వాటర్ వెపన్స్, అధునాతన మిస్సైల్స్‌‌ను బీడీఎల్ తయారు చేస్తోంది. మిస్సైల్స్‌‌ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్‌‌ టైం అని బీడీఎల్ చైర్మన్‌‌, ఎండీ సిద్ధార్థ్​ మిశ్రా అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌ ప్రజలకు మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లను డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌ సోమవారం వర్చువల్‌‌గా స్టార్ట్ చేశారు.