అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్

అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు  సీజ్

హైదరాబాద్:ఎన్నికల కోడ్ ఉన్నందున  అబిడ్స్ పోలీసులు వాహనాలు తనఖీలు నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. ఓ ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ.49 లక్షల విలువైన నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి రుజువులు చూపించకపోవడంతో సీజ్ చేశారు. 

హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ హనుమాన్ టెకడీ నుంచి టూవీలర్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 49 లక్షల 75 వేల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి.. వీటికి నిందితులు సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

ఇటీవల కూకట్పల్లిలో కూడా భారీగా నగదు పట్టుబడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 54లక్షల 52వేల పోలీసులు నగదును స్వాధీనం చేసుకు న్నారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున కూకట్పల్లిలోని అల్లూరి కాంప్లెక్స్ దగ్గర సైబరాబాద్ ఎస్వోటీ, బాలానగర్ టీమ్, కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా తనఖీలు నిర్వహిస్తుండగా..ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనంలో సరియైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. 

అక్రమంగా డబ్బును తరలిస్తున్న మహ్మద్ ఇటాచీ కి చెందిన సెక్యూరిటీ ఖలీల్,ఇటాచీ మేనేజ్మెంట్ సర్వీసెస్లో కస్టోడియన్ నగేష్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.