ఢిల్లీ: వినాయక నిమజ్జనంలో విషాదం జరిగింది. నిమజ్జనం అనంతరం స్నానం చేసేందుకు యమునా నదిలోకి దిగి నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో నివాసముండే కొందరు గురువారం గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం స్నానం కోసం 20 మంది భక్తులు భక్తాపూర్ వద్ద యమునా నదీ లోకి దిగారు.
వారిలో నలుగురు స్నానం చేస్తుండగా నదిలో మునిగి ఊపిరాడక ప్రాణాలు వదిలారు. మరో 8 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. చీకటి పడడంతో గత రాత్రి గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది.వారంతా నదిలోకి దిగుతుండగా పోలీసులు అడ్డుకున్నారని, ఏదో సాకు చెప్పి నదిలోకి వెళ్లారని సమాచారం.

