ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2025 నవంబర్ 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో.. బాంబ్ బ్లాస్ట్ ఘటనను ఖండించింది మంత్రివర్గం. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు సంతాపం తెలిపింది కేబినెట్. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఎర్రకోట పేలుడు ఘటన పిరికి పంద చర్యగా అభివర్ణించారు.
పేలుడుకు పాల్పడిన ఉగ్రమూకలను, వారికి మద్ధతస్తున్న వారిని, స్పాన్సర్స్ కు తగిన బుద్ధి చెప్పాలపి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీలైనంత తొందరగా దుండగులను శిక్షించాలని నిర్ణయంతీసుకున్నట్లు తెలిపారు.
►ALSO READ | దేశంలోని ఆరు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి బాంబు స్క్వాడ్స్
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని.. దానికి సహకరిస్తున్న వారిని కూడా ఉపేక్షించమని చెప్పారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్ 11న ఉగ్రమూకలు భారీ బాంబ్ బ్లాస్ట్ కు పాల్పడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఉగ్రవాదుల కోసం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు వేట మొదలు పెట్టారు. అదే విధంగా ఈ దాడికి సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు.
