ఢిల్లీ లిక్కర్ స్కామ్.. అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్..   అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు  బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. 

మేలో  సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆయనకు సుప్రీంకోర్టు జూన్ 01 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి ఆయన జైలుకు వెళ్లిపోయారు. మద్యం కుంభకోణంలో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ లంచంగా రూ.100 కోట్లను డిమాండ్‌ చేశారని ఈడీ ఆరోపించింది.