21 మంది చావుకు కారణం ఇతడే.. ఢిల్లీ హోటల్ వంటమనిషి అరెస్ట్

21 మంది చావుకు కారణం ఇతడే.. ఢిల్లీ హోటల్ వంటమనిషి అరెస్ట్

దేశవ్యాప్తంగా  సంచలనం సృష్టించిన ఢిల్లీ హోటర్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే హోటల్ యాజమానితోపాటు పలువురి అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ప్రమాదానికి ప్రధానకారణమైన హోటల్ కుక్ ను పోలీసులు శనివారం (జూన్ 6)  అరెస్టు చేశారు. హోటల్ కుక్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. కుక్ తోపాటు మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

బుధవారం  మాల్వీయ నగర్ లోని హోటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 13 మంది విదేశీయులతో సహా 21 మంది సజీవ దహనం అయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుల్లో  నలుగురు నైజీరియన్లు, ముగ్గురు మొజాంబిక్, లైబీరియా, ఉజ్జెకిస్తాన్, బంగ్లాదేవ్ , ఇరాక్ లకు చెందిన ఒక్కొక్కరు  ఉన్నారు. ఈ కేసులో హోటల్ యజమాని లవ్ కేష్ బజాజ్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు.