సిసోడియాపై ఆరోపణలు తీవ్రమైనవి.. బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు

సిసోడియాపై ఆరోపణలు తీవ్రమైనవి.. బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురయ్యింది.  మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ దినేష్ కుమార్ శర్మతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, మనీష్ సిసోడియాపై ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది.  సిసోడియా బెయిల్ పై బయటకెళ్తే సాక్షులను ప్రభావితం చేసే చాన్స్ ఉన్నందును  బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పుతో మనీష్ సిసోడియా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ కేసులో ఫిబ్రవరి 29న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేశారు. కోర్టు కస్టడీ విధించగా..ఇటీవల ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ  కోర్టు సిసోడియా కస్టడీని జూన్ 1 వరకు పొడిగించింది.  జైల్లో సిసోడియాకు  కుర్చీ,టేబుల్, పుస్తకాలు అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.