పార్కింగ్ స్లిప్ అడిగినందుకు ఓ సెక్యూరిటీ గార్డును నలుగురు వ్యక్తులు చితకబాదారు. ఢిల్లీ నగరంలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఆసుపత్రికి ఓ వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తుల్ని.. పార్కింగ్ స్లిప్ చూపించాలని అడిగాడు ఆ సెక్యూరిటీ గార్డు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అతడిని కారణం లేకుండా కొట్టారు, కాళ్లతో తన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. తీవ్రగాయాలైన ఆ గార్డు ప్రస్తుతం ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ దాడికి పాల్పడ్డ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
#WATCH Delhi: A security guard was beaten up by four persons in a hospital premises after he allegedly asked for a parking slip from them. The guard has been admitted at hospital. Four accused have been detained by Police. (9.10) pic.twitter.com/KPzPXDezjw
— ANI (@ANI) October 10, 2019

