V6 News

ఢిల్లీ నుంచి అక్రమ మద్యం

ఢిల్లీ నుంచి అక్రమ మద్యం
  •     నిందితుడు అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: ఢిల్లీలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, సిటీలో ఎక్కువ రేటుకు అమ్ముతున్న వ్యక్తిని సికింద్రాబాద్ ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. శారద కుమార్ (28) అనే వ్యక్తి ఢిల్లీకి సరుకు రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఒక్కో శివాస్ రీగల్ బాటిల్​ను రూ. 1,500లకు కొనుగోలు చేసి, మొండా మార్కెట్ పరిధిలోని శివాజీ నగర్, చెప్పాల్వాది బజార్ ప్రాంతాల్లో రూ. 3,000 నుంచి రూ. 3,500 వరకు అమ్ముతున్నాడు. 

పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం నిందితుడిని పట్టుకొని, తన అశోక్ లేలాండ్ వాహనంలో 52 శివాస్ రీగల్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 2.54 లక్షల వరకు ఉంటుందని అంచనా.