సత్యేంద్ర జైన్ కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ

సత్యేంద్ర జైన్ కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు.. 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీని విధించింది కోర్టు. కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే30 న సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు...  కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ  నేపథ్యంలోనే  సత్యేంద్రజైన్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. అనంతరం జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని కోరగా.... తాజాగా దానిని జూన్ 13 వరకు పొడిగించింది. దీంతో మొత్తం 14 రోజుల జ్యుడిషియల్  కస్టడీకి కోర్టు ఆమోదించింది. ఇదిలా ఉండగా ఆయన బెయిల్ పిటిషన్ పై రేపు ఢిల్లీ కోర్టు వాదనలు విననుంది.