ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగింది. ఎయిర్ ఇండిక్స్ 245గా నమోదైంది. అటు నోయిడాలనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 204కి పడిపోయింది. దీపావళికి ముందే ఢిల్లీ, నొయిడాలో వాయు కాలుష్యం పెరుగుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఘజియాబాద్ లో  229గా.. అటు ముండ్కాలో ఎయిర్  క్వాలిటీ ఇండెక్స్ 395 నమోదైనట్లు సెంట్రల్  పొల్యూషన్  కంట్రోల్  బోర్డు తెలిపింది. శనివారంతో పోలిస్తే ఐదురెట్లు ఎక్కువగా నమోదైన్నారు అధికారులు.

దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండిక్స్ మరింత దిగజారితే సెకండ్ స్టేజ్ రూల్స్ ను అమలు చేయనుంది సెంట్రల్  పొల్యూషన్ కంట్రోల్  బోర్డు.  అటు హోటళ్లు, రెస్టారెంట్ లో బొగ్గు వాడకంపై నిషేధం విదించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అధికారులను ఆదేశించారు.  ఎయిర్ పొల్యూషన్ చేసే ఫ్యాక్టరీలతోపాటు థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.