
సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)బిల్లుపై ఆందోళనలు, జేఎన్ యూ క్యాంపస్ లో విద్యార్ధులపై దాడిపై నిరసనలతో రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇదిలా ఉండగా ప్రధాన పట్టణాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది.
ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుకున్నట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి.
గుజరాత్ లోని వడోదరా గోర్వా ప్రాంతంలో కూడా ఓ ఐఎస్ఎస్ ఉగ్రవాది గుజరాత్ యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్(ATS ) కు చిక్కాడు. అరెస్టయిన వ్యక్తి జాఫర్ అలీని, తమిళనాడు ప్రభుత్వం అతని కోసం గత 10 రోజులుగా గాలిస్తుందని ATS అధికారులు తెలిపారు. ఐఎస్ఐఎస్ ను వ్యాప్తి చేయడానికే ఆ ఉగ్రవాది వడోదర వచ్చినట్టు సమాచారం.
మరికొన్ని రోజుల్లో దేశమంతా గణతంత్ర దినోత్సవాలకై సిద్ధమవుతున్న సమయంతో ఉగ్రవాదులు పట్టుబడడం తీవ్ర భయాందోళనలను కలిగిస్తుంది.