కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. జంతర్‎మంతర్ ధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్

కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. జంతర్‎మంతర్ ధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహా ధర్నాకు ఢిల్లీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం (జూన్ 6) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేసుకునేందుకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్, కాక్రోచ్ జనతా పార్టీ ధృవీకరించింది. జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారని సీజేపీ వెల్లడించింది.

‘‘జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మొదట అనుకున్నట్లుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా మనం జంతర్ మంతర్ వద్దే సమావేశం కావచ్చు. బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు’’ అని కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. 

నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే శనివారం (జూన్ 6) ఢిల్లీలోని జంతర్‎మంతర్ దగ్గర సీజేపీ మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికా నుంచి శనివారం ఉదయం ఢిల్లీకి వచ్చారు. ఎయిర్ పోర్టులో అభిజిత్ దీప్కేకు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.