స్కూళ్లు తెరుచుకున్నయ్: ఢిల్లీలో తగ్గుతున్న గాలి కాలుష్యం

స్కూళ్లు తెరుచుకున్నయ్: ఢిల్లీలో తగ్గుతున్న గాలి కాలుష్యం

దేశ రాజధాని  ఢిల్లీలో  గాలి  కాలుష్య తీవ్రత కొంత తగ్గింది. అధికారుల చర్యలు,  సరి బేసి  విధానం  అమలుతో  డేంజర్ లేవల్  నుంచి  కోలుకుంది. ఇవాళ  ఉదయం  లోధా రోడ్డులో  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్   279 పాయింట్లుగా  ఉంది. నిన్న ఇది  413 పాయింట్లుగా నమోదైంది.  ఢిల్లీలోని  మిగితా ప్రాంతాల్లోనూ  సివియర్  నుంచి పూర్ స్టేజీకి   AQI తీవ్రత  చేరింది. ఇక  కాలుష్యం  కాటుతో  మూతపడిన  స్కూళ్లు  ఇవాళ తెరుచుకున్నాయి.  అయితే  విద్యార్థులు  మాస్కులు ధరించే  స్కూళ్లకు  వస్తున్నారు. గాలి కాలుష్యంతో  ఇబ్బందులు పడుతున్నామని  స్టూడెంట్స్ చెప్పారు.

ఇవాళ కూడా  పొగ మంచు  దేశ రాజధానిని  కప్పేసింది. ఢిల్లీ శివారు ప్రాంతాలైన  గ్రేటర్ నోయిడా, గజియాబాద్ లోనూ  దట్టమైన పొగ కప్పేసింది. దీంతో  వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు.  ఢిల్లీలో  గాలి  కాలుష్యంపై  ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ  జరగనుంది. మరోవైపు  శివారు ప్రాంత  రైతులు తమ పంటలను  కాల్చకుండా  ఐదు రాష్ట్రాల  అధికారులు  చర్యలు తీసుకుంటున్నారు.  ప్రధానమంత్రి   ప్రిన్సిపల్ సెక్రటరీ  స్వయంగా పరిస్థితిని  పర్యవేక్షిస్తున్నారు.