88 ఏళ్ల రంజీ చరిత్రలో ముంబైపై రెండో విజయం

88 ఏళ్ల రంజీ చరిత్రలో ముంబైపై రెండో విజయం

రంజీ ట్రోఫీలో ఢిల్లీ టీం చరిత్ర సృష్టించింది. 42 ఏళ్ల తర్వాత ముంబైపై విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ జట్టు... 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబైపై విజయం సాధించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ రంజీ  సీజన్‌లో గ్రూప్ Bలో ఉన్న ఢిల్లీ..5 మ్యాచ్‌ల్లో మూడింటిని డ్రా చేసుకోగా..  రెండింటిలో ఓడింది. తాజాగా ఒక విజయాన్ని అందుకుంది. 

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఢిల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు 10 వికెట్లు కోల్పోయింది. దీతో ఢిల్లీకి 76 పరుగుల ఆధిక్యం లభించింది.  రెండో ఇన్నింగ్స్‌లో  170 పరుగులకే ఆలౌట్ అయిన ముంబై...ఢిల్లీకి 97 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 97 పరుగుల  లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ రవాల్‌(114)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.