మాల్స్‌, మార్కెట్లు సరి– బేసి విధానంలో ఓపెన్‌ చేయండి

మాల్స్‌, మార్కెట్లు సరి– బేసి విధానంలో ఓపెన్‌ చేయండి
  • కేంద్రానికి ఢిల్లీ ప్రభుత్వం సూచన

న్యూఢిల్లీ: ఈ నెల 17 తర్వాత లాక్‌డౌన్‌ను సడలించే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లు సరి – బేసి పద్ధతిలో తెరవాలని సూచించింది. మెట్రో, బస్సుల్లో సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ట్యాక్సీల్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా రూల్స్‌ పెట్టాలని చెప్పింది. “ ఢిల్లీలో మార్కెట్లు, కాంప్లెక్స్‌, మాల్స్‌, నాన్‌ ఎషన్షియల్ ఐటమ్స్‌ను అమ్మే షాప్స్‌ను సరి–బేసి పద్ధతిలో నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కంద్రాన్ని కోరాం ” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. దేశ రాజధానిలో ఎకనామిక్‌ యాక్టివిటీస్‌ను కొనసాగించేలా నిర్దిష్టమైన ఆపరేటింగ్‌ ప్రొసిడ్యూర్‌‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ఉంచాలా ఎత్తేయాలా అనే విషయంపై ఢిల్లీ ప్రజల నుంచి సూచనలు తీసుకున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ నెల 18 తర్వాత కేంద్ర సూచనల ప్రకారం ఎకనామిక్‌ యాక్టివిటీలు పాటిస్తామని ప్రకటించారు. కరోనాను కట్టడి చేసేందుకు మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ విధించిన కేంద్రం దాన్ని మే 17 వరకు పొడిగించింది.