
ఐపీఎల్ 16 భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు ప్రారంభమైంది. గౌహతిలోని బార్స్పరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్కు దిగనుంది. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే ఒక దాంట్లో గెలిచింది. మరో దాంట్లో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఆడిన రెండింటిలోనూ ఓడింది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (కీపర్), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.