V6 News

ఇది తెలంగాణ జీవపత్రం.. విజన్ డాక్యుమెంట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇది తెలంగాణ జీవపత్రం.. విజన్ డాక్యుమెంట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విజన్​ డాక్యుమెంట్​‘తెలంగాణ జీవపత్రం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘ఇది కొద్ది మంది గదిలో కూర్చొని చేసిన పని కాదు. ఇది విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమిష్టి సృష్టి. ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు.. ఒక నిపుణుల బృందం రాసింది కాదు.. నెలల తరబడి ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ విజిట్స్​, ప్రజా చర్చలు, స్థానికుల అభిప్రాయాలు.. ఇవన్నీ కలసి రూపొందిన జీవపత్రం ఇది.. ’’ అని ఆయన వివరించారు. 

ప్యూచర్​ సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్​ సమిట్’​ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ లక్ష్యాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగారన్నారు. ఆఫీసర్లు భూమ్మీదున్న వాస్తవాలను తీసుకొచ్చారని.. నాయకులు, విద్యావేత్తలు మేధోపరమైన అంశాలను జోడించారని ఆయన తెలిపారు.  

ఆలోచనలను జోడించి..  

సమ్​ ప్లస్​ ఇట్​ సమిట్​ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్లోబల్​ సమిట్ ప్రాంగణంలో ప్రతి సెషన్ కొత్త ఆలోచనలను జోడించిందని, అవకాశాలను గుణించిందని చెప్పారు. ఇది రాజకీయ వేదిక కాదని తెలిసినా,    సోనియా గాంధీ  పుట్టినరోజు సందర్భంగా ఆమెను తలచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్​, ఆశయాలకు తగ్గట్టు సమిట్​ జరిగింది” అని ఆయన చెప్పారు. తాను అధ్యక్షత వహించిన ఉత్పాదకత, విద్యుత్ అనే రెండు సెషన్ల గురించి వివరించారు.