ఇవాళ(జూన్ 09) యాదాద్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇవాళ(జూన్ 09) యాదాద్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యాదాద్రి, వెలుగు:   యాదాద్రికి  నేడు​డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు.  ఈ సందర్భంగా ఆయా మండలాలకు సంబంధించిన రూ. 14.05 కోట్ల అభివృద్ధి పనులకు రిమోట్​ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్ యాదాద్రి జిల్లా సర్కిల్ భువనగిరిలో రూ. 5.83 కోట్ల వ్యయంతో నిర్మించిన సర్కిల్ ఆఫీసును ప్రారంభిస్తారు. 

భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడిలో రూ. 2.67 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌ను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ సబ్‌‌‌‌స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల సుమారు 1,279 మంది రైతులకు నాణ్యమైన విద్యుత్ అంది లబ్ధి చేకూరుతుంది. భువనగిరి మండలం హనుమపురంలో రూ. 2.03 కోట్లతో నిర్మించనున్న స్టోర్ కాంప్లెక్స్, వలిగొండ మండలం నర్సాపూర్​లో రూ. 3.52 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్‌‌‌‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.