గ్రామంలో రోడ్లు వేయడం లేదని అరగుండుతో ఉప సర్పంచ్ నిరసన

గ్రామంలో రోడ్లు వేయడం లేదని అరగుండుతో ఉప సర్పంచ్ నిరసన

మఠంపల్లి, వెలుగు: గ్రామంలో రోడ్లు వేయడం లేదని ఓ ఉప సర్పంచ్ అరగుండుతో నిరసన తెలిపాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో జరిగింది. మండలంలోని అవిరేనికుంట తండాకు చెందిన బీఆర్ఎస్ లీడర్, ఉప సర్పంచ్ చీనా నాయక్.. తండాలో ఇంటర్నల్ రోడ్లు వేయాలని, తండా నుంచి పెదవీడు వరకు బీటీ రోడ్డు వేయాలని ఎప్పటి నుంచో ఆఫీసర్లను కోరుతున్నాడు.

అయినా పట్టించుకోకపోవడంతో విసిగివేసారి అరగుండు కొట్టించుకుని మండలకేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు ముందు నిరసన తెలిపాడు. అనంతరం ఎంపీడీవో జానకిరాములుకు వినతిపత్రం ఇచ్చాడు. ఇకనైనా స్పందించి రోడ్లు వేయాలని కోరాడు.