దేవరకొండ, వెలుగు: సివిల్ సప్ల్ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దేవరకొండలో పలు హోటల్లో దాడులు చేసి, 27 డొమెస్టిక్ సిలిండర్లు పట్టుకున్నారు. వాటిని దేవరకొండ గ్యాస్ గోదాంకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారావసరాల కోసం వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో దేవరకొండ సివిల్ సప్లయ్ అధికారి బోడిగే అంజయ్య, కమాల్ పాషా, ముబీన్, డీటీసీఎస్ ఎండీ ముక్తార్, దీపక్,సైదులు గౌడ్, జ్యోతి, ఆర్ఐ సైదులు, కుమార్ రెడ్డి,సిబ్బంది సైదులు పాల్గొన్నారు.
