విద్యార్థులను ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దుతం

విద్యార్థులను ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దుతం
  • త్వరలోనే కొత్త క్రీడా పాలసీ: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: విద్యా రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. విద్యా రంగంలో ప్రమాణాలను పెంచడం, ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం విద్యా కమిషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసిందని ఆదివారం ఓ ప్రకటనలో మంత్రి చెప్పారు. విద్యార్థులను ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే కొత్త క్రీడా పాలసీని రూపొందిస్తామని తెలిపారు. 

మనిషిని బహిర్గతంగానూ, అంతర్గతంగానూ వికసింపజేసేదే నిజమైన విద్య అన్నారు. బానిసత్వం, ఆత్మన్యూనత నుంచి మనిషిని చదువు విముక్తుడిని చేస్తుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్  పాలనలో నిర్వీర్యమైన విద్యా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం జీవం పోస్తున్నదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తొలిరోజే యూనిఫాం, పుస్తకాల పంపిణీ, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపు వంటివి చేశామని చెప్పారు. అలాగే, యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్స్, యంగ్  ఇండియా స్కిల్  యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.