కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం నుంచే  క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయాన్నే స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మల్లన్నకు  అభిషేకం చేసి పట్నాలు వేసి గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 

కొంత మంది స్వామి వారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. మరికొందరు కొండపైన రేణుక ఎల్లమ్మను దర్శించుకొని బోనం సమర్పించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవో వెంకట్ ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఏఈఓ శ్రీనివాస్, చైర్మన్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్​నీల శేఖర్, ఆలయ ధర్మకర్తలు పయ్యావుల ప్రవీణ్ యాదవ్, బొచ్చు ఎల్లయ్య, సార్ల లింగం, కొమురయ్య, రావికంటి సత్యనారాయణలు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించిచారు.