V6 News

ఖైదీలను సరిదిద్దే బాధ్యత జైళ్ల శాఖదే: డీజీపీ శివధర్‌‌ రెడ్డి

ఖైదీలను సరిదిద్దే బాధ్యత జైళ్ల శాఖదే: డీజీపీ శివధర్‌‌ రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: జైళ్ల శాఖ సమాజానికి అత్యంత ముఖ్యమని డీజీపీ శివధర్‌‌రెడ్డి అన్నారు. నాలుగు గోడల మధ్య తాళాలు వేసే పని కాదని ఖైదీలను సరిదిద్దుతూ సమాజంలో తిరిగి కలిపే బాధ్యత అని పేర్కొన్నారు. చంచల్‌గూడ్‌లోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో మంగళవారం నుంచి ఢిల్లీ జైళ్ల (తీహార్ జైల్‌) సిబ్బందికి ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభమైంది. 

కార్యక్రమానికి డీజీపీ శివధర్ రెడ్డి, జైల్స్ డీజీ సౌమ్యామిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ ట్రైనింగ్‌ పొందుతున్న ఢిల్లీ జైల్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. సికాపై విశ్వాసంతో పెద్ద సంఖ్యలో సిబ్బందిని శిక్షణకు పంపడం గర్వకారణమని తెలిపారు. మొత్తం 381 మంది ఢిల్లీ జైళ్ల సిబ్బందిని దశలవారీగా శిక్షణకు ఎంపికచేశారు. మొదటి దశలో 62 మందికి ట్రైనింగ్‌ ఇస్తున్నారు.