
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తిరిగి విధుల్లో చేరారు. రెండు వారాల లీవ్ తరువాత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ రోజు తిరిగి విధుల్లో చేరినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 18 నుంచి మహేందర్ రెడ్డి సెలవుల్లో ఉన్నారు. బాత్రూంలో కాలు జారి పడ్డ డీజీపీ మహేందర్ రెడ్డి.. వైద్యుల సూచనల మేరకు రెండు వారాల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నారు.