ఈనెల 18న "ధమాకా" ఫస్ట్ సింగిల్

ఈనెల 18న "ధమాకా" ఫస్ట్ సింగిల్

మాస్‌ మహారాజా ర‌వితేజ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వ‌రుస‌ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం "ధమాకా". త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుండి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ 'జింతాక్' లిరికల్ వీడియోను ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్‌లో రవితేజ సాంప్రదాయ దుస్తుల్లో శ్రీలీలాను మోస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ డ్యాన్స్ నంబర్‌లో మనం మాస్ స్టెప్పులు చూడవచ్చు.. పోస్టర్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇక ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ధమాకా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు.