ధనుష్ శ్రీకాంత్‌‌కు డెఫ్‌‌ లింపిక్స్‌‌ బెర్తు

ధనుష్ శ్రీకాంత్‌‌కు డెఫ్‌‌ లింపిక్స్‌‌ బెర్తు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ యంగ్ షూటర్‌‌‌‌ ధనుష్  శ్రీకాంత్ నవంబర్‌‌లో టోక్యోలో జరిగే ప్రతిష్టాత్మక డెఫ్‌‌లింపిక్స్‌‌కు క్వాలిఫై అయ్యాడు.  భోపాల్‌‌లో మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ట్రయల్స్‌‌లో 634.9,  631.9 పాయింట్లు సాధించి ఈ ఘనతను అందుకున్నాడు. హైదరాబాద్‌‌కు చెందిన ధనుష్ 2022లో బ్రెజిల్‌‌లో జరిగిన గత ఎడిషన్‌‌ డెఫ్‌‌లింపిక్స్‌‌లో పోటీ పడి రెండు గోల్డ్‌‌ మెడల్స్‌‌తో చరిత్ర సృష్టించాడు.  

క్వాలిఫికేషన్ రౌండ్‌‌లో వరల్డ్‌‌ రికార్డు కూడా నెలకొల్పాడు. వినికిడి లోపం ఉన్నప్పటికీ అతను రెగ్యులర్ ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా మెడల్స్ నెగ్గి టాలెంట్ నిరూపించుకున్నాడు. ఒక చాంపియన్ కు ఉండాల్సిన క్రమశిక్షణ, పట్టుదల ధనుష్‌‌లో ఉన్నాయని,  టోక్యోలో కూడా అతను ఇండియాకు గర్వకారణంగా నిలుస్తాడని తన కోచ్‌‌ గగన్ నారంగ్ చెప్పాడు.