నా బంగారం నాకు కావాలి: మనప్పురంలో డబ్బులు కట్టినా గోల్డ్ ఇవ్వడంలేదు

నా బంగారం నాకు కావాలి: మనప్పురంలో డబ్బులు కట్టినా గోల్డ్ ఇవ్వడంలేదు

వరంగల్: ఎంతో నమ్మకంతో మనప్పురం ఫైనాన్స్ లో గోల్డ్ తాకట్టు పెట్టానని.. అయితే కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ లో డబ్బులు కట్టినా.. గోల్డ్ ఇవ్వడంలేదంటూ ధర్నాకు దిగాడు బాధితుడు. ఈ సంఘటన వరంగల్ లో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. ఎంతో నమ్మకంగా వరంగల్ లోని సుబేదారి మనప్పురం బ్రాంచిలో గోల్డ్ లోన్ తీసుకున్నానని.. అయితే.. డబ్బు సర్దుబాటు అవ్వగానే గోల్డ్ ను విడిపించుకోవడం కోసం ఆన్ లైన్ లో పేమెంట్ చేశానని తెలిపాడు. తీరా గోల్డ్ తీసుకుందామని బ్రాంచి దగ్గరకు వెళ్తే ఆఫీసుకు తాళం వేశారని చెప్పాడు.

ఫోన్ చేస్తే రేపు రండి.. ఎల్లుండి రండి అంటూ ఇబ్బందులు పెడుతున్నారని తెలిపాడు. ఆన్ లైన్ లో సెప్టెంబర్ 04న డబ్బులు కట్టానని తెలిపిన బాధితుడు మాడిశెట్టి సంపత్.. ఇప్పటివరకు బ్రాంచి తాళం తీయడంలేదన్నారు. మోస పోయానని తెలుసుకున్న సంపత్.. న్యాయ పోరాటం కోసం రోడ్డెక్కాడు. ప్రజా ప్రతినిధులు, పోలీసులు నాకు మద్దతు తెలుపుతూ నా బంగారం నాకు ఇప్పించాలంటూ ఫ్లెక్సీతో ఆఫీసు ముందు దర్నాకు దిగాడు. 15 రోజులుగా మనప్పురం బ్రాంచి తెరవడంలేదని.. గోల్డ్ కోసం వస్తే ఆన్ లైన్ లో పేమెంట్ చేయమన్నారని.. తీరా చూస్తే ఇప్పుడు ఇలా ఫోన్ లో మభ్యపెడుతూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు మాడిశెట్టి సంపత్.