కోల్‌కతా: వెస్ట్ బెంగాల్‌లో 200 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లలో 200 సీట్లు తప్పక సొంతం చేసుకుంటామని దిలీప్ స్పష్టం చేశారు. ‘మేం 200 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం. అంతకంటే తక్కువ సీట్లు రావనే భావిస్తున్నాం. ఈ ఎలక్షన్స్‌కు సంబంధించిన సన్నాహకాలను ఇవ్వాళ మొదలుపెట్టలేదు. ఐదేళ్ల కిందటే ఈ ఎన్నికల ప్రిపరేషన్స్‌ను షురూ చేశాం. దశల వారీగా ముందుకెళ్లాం. లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఫలితాలను చూశాం’ అని దిలీప్ చెప్పారు. ఇక బీసీసీఐ బాస్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీజేపీలో జాయిన్ అవుతున్నారని బెంగాల్‌లో ప్రచారం జరుగుతోంది. దీనిపై దిలీప్ స్పందించారు. దాదా బీజేపీలో చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని, ఆయనతో తానెప్పుడూ ఈ విషయం గురించి చర్చించలేదన్నారు.

