డింపుల్ హాయతికి బంగారు గుడి.. అభిమాని అత్యుత్సాహం

డింపుల్ హాయతికి బంగారు గుడి.. అభిమాని అత్యుత్సాహం

రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతీకి ఒక అభిమాని గుడి కడతాను అన్నాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానానికి మనోడి దిమ్మతిరిగిపోయింది. మళ్ళీ అలాంటి ఆలోచన కూడా రాకుండా చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. డింపుల్ ప్రస్తుతం గోపిచంద్ తో రామబాణం అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ  మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇందులో బాగంగా.. ఆమె  సోషల్ మీడియా వేధికగా అభిమానులతో ముచ్చటించింది. ఫాన్స్ అడిగిన ప్రశ్నలకి ఓపికగా సమాధానాలు చెప్పింది. అయితే.. అందులో ఒక అభిమాని అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.  మీకు గుడి కట్టాలి అనుకుంటున్నాను. ఇటుకలతో కట్టాలా లేక పాలరాయితో కట్టాలా? అని డింపుల్ ని ప్రశ్నించాడు.  ఈ ప్రశ్నకు డింపుల్ హయాతీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. నిజంగా నాకు గుడి కట్టే ఆలోచన నీకు ఉంటే బంగారంతో కట్టాలని సూచించింది. దాంతో సదరు అభిమాని మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక డింపుల్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్స్ సూపర్ కౌంటర్ ఇచ్చారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 సాధారణంగా తమిళనాడులో హీరోయిన్స్ కి ఎక్కువగా  గుడులు కడుతుంటారు ఫాన్స్. ఈ మధ్య ఆ కల్చర్ ఏపీకి కూడా పాకుతుంది. ఇటీవల బాపట్ల జిల్లాకి చెందిన సందీప్ అనే వ్యక్తి తన ఇంట్లోనే సమంతకు గుడి కట్టించారు. ఇక ఇప్పుడు  డింపుల్ హయాతీకి కూడా ఒక అభిమాని గుడి కడతానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రామబాణం మూవీలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో..  జగపతిబాబు కీలక రోల్ చేస్తునాడు.  అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.