బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలనే కెప్టెన్సీకి గుడ్ బై

బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలనే కెప్టెన్సీకి గుడ్ బై

దుబాయ్: ఈ  సీజన్ ఐపీఎల్ లో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్.  దుబాయ్‌లో జ‌రుగుతున్న ఐపీఎల్ టోర్నీలో కోల్‌క‌తా జ‌ట్టుకు దినేశ్ కార్తీక్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.  శుక్రవారం నుంచి ఆ టీమ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు.  శుక్రవారం ముంబై ఇండియ‌న్స్‌తో కేకేఆర్ మ్యాచ్ ఆడ‌నుంది.  బ్యాటింగ్‌పై ఫోక‌స్ పెట్టాల‌న్న దృష్టితో కెప్టెన్సీని వ‌ద‌లుచుకుంటున్న‌ట్లు తెలిపాడే దినేశ్. ఆలాంటి ఆట‌గాళ్లు టీమ్ లో ఉండ‌డం మంచిద‌ని, చాలా సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని సీఈవో వెంకీ మైసూర్ తెలిపాడు.