గుజరాత్ లో డైనోసార్ల శిలాజాల ఓపెన్ మ్యూజియం

గుజరాత్ లో డైనోసార్ల శిలాజాల ఓపెన్ మ్యూజియం

దేశంలోనే మొదటిసారిగా డైనోసార్ల శిలాజాల ఓపెన్ మ్యూజియం గుజరాత్ లోని మహిసాగర్  జిల్లాలో ప్రారంభించారు. మహిసాగర్ జిల్లాలోని రాయ్ యోలి గ్రామంలో ఏర్పాటు చేసిన మ్యూజియంను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్  రూపాని ప్రారంభించారు. ఇలాంటి మ్యూజియం భారత్ లో మొదటికాగా… ప్రపంచంలో మూడోదని విజయ్ రూపానీ చెప్పారు. స్యాట్యూ ఆఫ్ యూనిటీ తర్వాత ఈ మ్యూజియం గుజరాత్ కు చిహ్నంగా నిలుస్తుందన్నారు. అల్ట్రామోడ్రన్ టెక్నాలజీ, త్రీడీ ప్రొజెక్షన్ , వర్చువల్  రియాలిటీతో ఈ మ్యూజియంలో ప్రదర్శనలుంటాయి. డైనోసార్ల జీవిత పరిణామక్రమంతో పాటు, వాటి భారీ బొమ్మలను కూడా మ్యూజియంలో ఉంచారు. మొత్తం 10 గ్యాలరీలు ఉన్నాయి.  దాదాపు 65 మిలియన్  ఏళ్ల నాటి రాక్షసబల్లుల చరిత్రను ఇక్కడ ఉంచారు. మహిసాగర్ జిల్లాలో గతంలో డైనోసార్  శిలాజాలు, వాటి గుడ్లు దొరికాయి.