షారుక్ ఖాన్ మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్

షారుక్ ఖాన్ మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్

‘పుష్ప’ సినిమాతో వరల్డ్‌‌వైడ్‌‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా హిందీలోనూ సెపరేట్ క్రేజ్ రావడంతో.. బన్నీకి బాలీవుడ్‌‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందనే న్యూస్ వినిపిస్తోంది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో బన్నీకి గెస్ట్ రోల్ ఆఫర్ చేశాడట దర్శకుడు అట్లీ. మొన్నటివరకు దళపతి విజయ్ పేరు వినిపించగా.. తాజాగా అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది.

 మరి వీరిద్దరిలో ఎవరు నటిస్తున్నారు?.. లేదంటే ఇద్దరూ కనిపిస్తారా అనేది తెలియాలంటే మూవీ టీమ్‌‌ నుంచి అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. బన్నీ  కనుక షారుఖ్​ సినిమాలో కనిపిస్తే సౌత్‌‌లో ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయి. ఇదిలా ఉంటే బన్నీ మాత్రం ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌‌తో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌‌గా వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. హైదరాబాద్‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌లో జాయిన్ అయ్యాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌తో ఈ  షెడ్యూల్ పూర్తవుతుందని తెలుస్తోంది. పార్ట్‌‌1కి సూపర్బ్‌‌ రెస్పాన్స్ రావడంతో  సుకుమార్ ఈ ప్రాజెక్ట్‌‌పై మరింత కేర్ తీసుకుంటున్నాడట. ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్‌‌కి ప్లాన్ చేస్తున్నారు.