సూర్యతో రోలెక్స్ మూవీని ప్లాన్ చేస్తున్న లోకేష్ కనగరాజ్

సూర్యతో రోలెక్స్ మూవీని ప్లాన్ చేస్తున్న లోకేష్ కనగరాజ్

ఓ వైపు కమర్షియల్ సినిమాలు.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలు.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ పెంచుకున్నాడు సూర్య. ఏ క్యారెక్టర్ చేసినా ఆ పాత్రలో తనను తప్ప మరొకరిని ఊహించలేం. అంతలా ఇంప్రెస్ చేసే సూర్య... ‘విక్రమ్’ సినిమాలో డ్రగ్‌‌‌‌ మాఫియాను శాసించే ‘రోలెక్స్‌‌‌‌’ పాత్రలో మెస్మరైజ్ చేశాడు.  క్లైమాక్స్‌‌‌‌లో సూర్య కనిపించింది పది నిమిషాల సీన్ అయినప్పటికీ ఆ క్యారెక్టర్ ఎక్కువ ఇంపాక్ట్‌‌‌‌ని క్రియేట్‌‌‌‌ చేసింది. దీంతో ఈ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తోనే ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ సినిమా చేయమని అడుగుతున్నారు ఫ్యాన్స్.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇదే ప్లాన్‌‌‌‌లో ఉన్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు. ప్రస్తుతం విజయ్‌‌‌‌ హీరోగా ఓ సినిమా చేస్తున్న లోకేష్... అది పూర్తయ్యాక ‘ఖైదీ’ సీక్వెల్, ‘విక్రమ్’ సీక్వెల్ చేయాల్సి ఉంది. ఈ వరుసలో ‘రోలెక్స్‌‌‌‌’ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ‘పరిస్థితులను బట్టి ఈ చిత్రాలు అటు ఇటు కావొచ్చు. ఇది మల్టీ యూనివర్స్.. ఇందులో ఏ సినిమా ఎప్పుడొస్తుందో ఇప్పుడే చెప్పలేను.. మరో పదేళ్ల వరకూ వీటితో నేను సెటిల్‌‌‌‌’ అని చెప్పాడు లోకేష్. ఒక్కో సినిమాకు రెండేళ్లు టైమ్‌‌‌‌ తీసుకునే లోకేష్‌‌‌‌... సూర్యతో ‘రోలెక్స్‌‌‌‌’ ఎప్పుడు తీస్తాడో చూడాలి!