- డీఎంహెచ్‌వోలకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సివిల్, డెంటల్ సర్జన్ల ఖాళీల లెక్కలను అర్జెంట్‌గా పంపాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) ఆఫీస్ నుంచి మంగళవారం టాప్ ప్రయారిటీ మెమో రిలీజ్ అయ్యింది.
రాష్ట్రంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, టీచింగ్ హాస్పిటల్స్ లో మంజూరైన పోస్టులెన్ని? అందులో రెగ్యులర్, కాంట్రాక్ట్ కింద ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నరు? ఇంకా ఎన్ని ఖాళీలున్నయ్? వంటి పూర్తి డేటాను పంపాలని డీహెచ్ ఆఫీస్ ఆదేశించింది. ఈ వివరాలను బుధవారం నిర్ణీత ఫార్మాట్‌లో doctorsdivision@gmail.com కు మెయిల్ చేయాలని, లేట్ చేస్తే ఒప్పుకోమని డీఎంహెచ్‌వోలకు, హాస్పిటల్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు.
