V6 News

ఓడీ టీచర్లను రిలీవ్ చేయొద్దు..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు

ఓడీ టీచర్లను రిలీవ్ చేయొద్దు..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓడీ (ఆన్ డ్యూటీ) ప్రాతిపదికన డిప్యుటేషన్‌‌‌‌పై పనిచేస్తున్న టీచర్ల విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వారిని ప్రస్తుతానికి రిలీవ్ చేయవద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. 2025-–26 విద్యా సంవత్సరంలో వివిధ అవసరాల నిమిత్తం డైరెక్టరేట్ నుంచి అనేకమంది టీచర్లను ఓడీ ప్రాతిపదికన డిప్యుటేషన్ ఇచ్చారు.

కాగా, ఈ నెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈసారి సెలవుల దృష్ట్యా వారిని రిలీవ్ చేయవద్దని డైరెక్టర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 23న ఓడీ టీచర్లను రిలీవ్ చేయవద్దని సంబంధిత ఎంఈవోలు, హెడ్ మాస్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆర్జేడీలు, డీఈవోలను డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు.