నేనది ఇన్సల్ట్‌ గా భావిస్తాను

నేనది ఇన్సల్ట్‌ గా భావిస్తాను

తొలిచిత్రం ‘అల్లరి’ మొదలు తన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని తపించే దర్శకుడు రవిబాబు. అందుకే ప్రతి సినిమా తన తొలిచిత్రమే అంటున్నాడు.పందిపి ల్లతో ప్రయోగాత్మకంగా ఆయన రూపొందించిన ‘అదుగో’ చిత్రం ఈనెల 7న విడుదలవుతోన్న సందర్భంగా రవిబాబుతో చిట్‌ చాట్.

పెద్దవాళ్ల మాట వినకుండా ఇంటినుంచి పారిపోయిన ఓ పంది పిల్ల కథ ఇది. హీరో హీరోయిన్స్, విలన్స్, పిల్లలు ఉంటారు. వాళ్లం దరి నడుమ ఈ పందిపిల్ల ఓ రోజంతా గడిపి, ఒక అడ్వెంచర్‌‌ను ఎక్స్‌ పీరియన్స్ చేసి బుద్ధి తెచ్చుకుని మళ్లీ ఇంటికెలా చేరిం దనేది కథ. యాక్షన్‌‌కామెడీ సినిమా. రెం డు గంటలే నిడివి.‘ప్లానెట్‌‌ ఆఫ్ ది ఏప్స్’ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌‌ని. డిస్నీ సినిమాలు చూసిన స్పూర్తితో ఏదైనా జంతువుతో సినిమా చేయాలనుకున్నాను . ఈగ మొదలు అన్ని జంతువులతో తీసేశారు. విదేశాల్లో పందితోనూ తీశారు కానీ మనదేశంలో ఎవరూ చేయలేదు. అందుకే పందిపిల్లతో సినిమాకి ఫిక్స్ అయ్యాను.సినిమాల విషయాలు ఎక్కువగా ఎవరితోనూ షేర్‌‌ చేసుకోను. దాదాపుగా నా సినిమాలన్నింటికీ రైటర్‌‌ సత్యానంద్‌ గారే.

ఈ సినిమా లైన్‌‌ సురేశ్‌ బాబుగారికి చెప్పి సత్యానంద్‌ గారితో కలసి డెవె లప్‌‌ చేశాను. నాకు చాలా చిన్న క్రూవుంటుం ది. అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ కూడా ఒక్కడే.పందికి డబ్బిం గ్‌ చెప్పమని హీరోలను అడగటానికి ఇబ్బందిగా అనిపించిం ది. కానీ ఎవరో ఒకరు చెప్పాలి కదా అని కామిక్‌ ఇమేజ్‌ ఉన్నరాజేం ద్రప్రసాద్‌ గారిని అడిగాను. వెరైటీగా ఉంటుం దని కన్వి న్స్ చేయడంతో ఓకే అన్నారు. బంటీ తండ్రి పాత్రకు డబ్బిం గ్‌ చెప్పారు.మనకున్న వనరులు, సాం కేతిక పరిజ్ఞా నం, బడ్జెట్‌‌తో ఈ తరహా సినిమా ఏది చేసినా ఎక్కువ సమయమే పడుతుం ది. ఈ సినిమా చేయాలంటే రియల్‌ పిగ్‌ లెట్‌‌ను వాడాలి. అది కష్టమని యానిమ్యాట్రిక్స్ ఎంచుకున్నాం. కానీ ఆ టెక్నాలజీ ఖరీదు రజనీకాం త్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ. దాం తో ఆ టెక్నాలజీనే డెవలప్‌‌ చేశాం . వర్కవుటవకపోవడంతో త్రీడీయానిమేషన్‌‌కు మారాం . యానిమ్యాట్రిక్స్‌ కు ఆరు నెలలు, యానిమేషన్ రీసెర్చ్‌‌కు మూడు నెలలు, షూటిం గ్‌ కు మరో మూడు నెలలు.అంతా అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్‌‌కి ఒకటిన్నర సంవత్సరం.

యానిమేషన్ సినిమా టచ్‌ చేస్తే కరెక్షన్స్‌ కే ఎనిమిది నెలలు పడుతుం దనేది ఈ చిత్రంతో నేర్చు కున్నా. పెటా నిబంధనలకు లోబడే చేశాం . యానిమేషన్‌‌లో చేయడానికి కారణం కూడా అదే. కానీ సీన్స్‌ సహజంగా రావాలంటే పందిపిల్ల అవసరం. దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయనేది యానిమేటర్స్‌ కు చూపించడానికి పంది కంపల్సరీ. అదంతా పెద్ద టెక్నికల్‌ సబ్జెక్ట్‌‌లెండి.ప్రతిసారి కొత్త సబ్జెక్ట్ అనుకుంటాను .దాన్నెలా ప్రమోట్ చేసి బయటకు తేవాలా అనే టెన్షన్. నా కెరీర్‌‌ మొత్తం ఇలాం టి అనుభవాలే.అందుకే ప్రతిదీ మొదటి సినిమాలాగే అనిపిస్తుం ది.ప్రతిరోజూ ఫ్రస్టేటెడ్‌‌గానే ఉండేది. చాలాసార్లు సినిమా వదిలేసి పారిపోదామనుకున్నా. మధ్యలో వదిలేయలేం కదా. అదీకాక పదిరోజుల తర్వాత పురోగతి కనిపిం చేది. మళ్లీ ఉత్సాహంతో చేసేవాణ్ని. చెప్పుకోలేని సమస్యలు ఇంకా చాలానే ఎదుర్కొన్నాను .నీ సినిమా బాలేదు కానీ కలెక్షన్స్ బాగున్నాయి అంటే నేనది ఇన్సల్ట్‌‌గా భావిస్తాను. విమర్శనాత్మక ప్రశంసలు కోరుకుంటాను . సినిమా బాగుండాలి, వసూళ్లూ బాగుండాలి. చూసిన కథనే మళ్లీ చూశాం అని ప్రేక్షకులు మాట్లాడే కమర్షియల్‌ సినిమాలు నాకక్కర్లేదు. ఈ సినిమా కోసం రెం డేళ్లు నటిం చడం ఆపేశా. గ్యాప్‌‌ వచ్చిం ది కనుక చాలామంది దర్శకులు నన్ను మర్చిపోయుంటారు. కానీ నాకు యాక్టింగ్‌ ఇష్టం . ఇది విడుదలవుతోం ది కనుక ఇక నటనపై దృష్టి పెడతాను.